అంగన్వాడి కేంద్రాల వార్షికోత్సవాలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.చిన్నారుల ఆట పాటలు,వేషధారణతో ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  సిడిపిఓ సూపర్వైజర్ అరవింద( CDPO Supervisor Aravind ) హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలలో ఎంతో మేధాశక్తి ఉంటుందని బాల్య వయసులోనే ప్రాథమిక విద్యను అభ్యసించినట్లయితే ఉన్నత విద్యను అభ్యసించడంలో ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటారని తెలిపారు.తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలని,అంగన్వాడి కేంద్రాలలో మానసికంగా శారీరకంగా ఎదగడానికి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు.

అంగన్వాడి కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,అయమ్మలు,చిన్నారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News