హిందువులు లేని దేశం.. జాతీయ పతాకంపై హిందువుల గుడి..

అంకోర్వట్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ప్రసిద్ధి చెందింది.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక చిహ్నంగా కూడా గుర్తింపు పొందింది.

ఈ ఆలయం కంబోడియా లోని అంకోర్‌లో ఉంది.కానీ కంబోడియాలో ఒక్క హిందువు కూడా లేరు.

అతిపెద్ద హిందూ దేవాలయం ఉన్నప్పటికీ.ఇక్కడ హిందూ ధర్మాన్ని ఎందుకు ఆచరించరనేది ఓ ప్రశ్న.

 చారిత్రక ఆదారాల ప్రకారం ఇక్కడి ప్రజలు ఇతర మతాలను స్వీకరించారు.కంబోడియాలోని అంకోర్‌ వద్ద ఉన్న మెకాంగ్ న‌ది స‌మీపంలో సుమారుగా 162.6 హెక్టార్ల విస్తీర్ణంలో అంకోర్‌ వ‌ట్ ఆల‌యం ఉంటుంది.ఇది విష్ణు ఆలయం.

Advertisement

ఇక్కడ అప్పటి పాలకులు శివుని దేవాలయాలను కూడా నిర్మించారు.ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో యశోధ్‌పూర్ అని పిలిచేవారు.

ఈ విష్ణు ఆలయాన్ని క్రీస్తుశకం 1112 నుంచి క్రీస్తుశకం 1153 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన 2వ సూర్యవర్మ రాజు నిర్మించారు.ఆల‌యాన్ని మొత్తం 1 కోటి రాళ్లతో నిర్మించార‌ని అంటారు.

ఇక 16వ శతాబ్దం వ‌ర‌కు ఈ ఆల‌యం ఎవ‌రికీ క‌నిపించ‌లేదు.ద‌ట్ట‌మైన అడ‌వులు ఉండ‌డం కార‌ణంగా అప్ప‌ట్లో ఆ ప‌ని సాధ్యం కాలేదు.16వ శతాబ్దం నుంచి  ఈ ఆల‌యాన్ని ప‌ర్యాట‌కులు సంద‌ర్శిస్తుంటారు.ఈ ఆలయ చిత్రం కంబోడియా జాతీయ పతాకంలో కనిపిస్తుంది.ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.

అలాగే యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూగా గుర్తింపు పొందింది.ఎంతో పురాతన‌మైన ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాల‌ని ఎవ‌రికైనా ఆస‌క్తి ఉంటే కంబోడియా వ‌ర‌కు వెళ్లాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు