సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నటువంటి ఈయన సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈయనకు రోజురోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.

మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పటికే జవాన్, జైలర్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే లియో ( Leo ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇక మరికొన్ని సినిమాలకు కూడా పనిచేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన మ్యూజిక్ కి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ఈయన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయనని ఏకంగా హీరోగా నియమించే సినిమా చేయాలని ఆలోచనలు కోలీవుడ్ ఇండస్ట్రీ ఉందని తెలుస్తోంది.

కోలీవుడ్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం త్వరలోనే ఈయన హీరోగా మారి సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) అనిరుద్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.మరి అనిరుద్ హీరోగా సినిమా చేయబోతున్న ఆదర్శకుడు ఎవరు అనే విషయానికి వస్తే లోకేష్ సినిమాల కోసం స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి అన్బరవీలు( Anbariv ) ఈ సినిమాకు దర్శకులుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.
.






