తెలుగులో హాట్ కేకుల్లా ''యానిమల్'' టికెట్స్.. రికార్డులు ఖాయం!

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal Movie ) ఒకటి.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.

 Animal Advanced Booking Open In Telugu States Details, Animal, Ranbir Kapoor, Sa-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే అంచనాలు పెంచేసుకున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రచార చిత్రాలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలు పెంచేసాయి.

టీజర్, సాంగ్స్, నిన్న వచ్చిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది.

డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుండగా మేకర్స్ ప్రమోషన్స్ మరింతగా పెంచేశారు.అలాగే ఎప్పుడో ఓవర్సీస్ లో బుకింగ్స్( Animal Movie Bookings ) స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు వారం ముందుగానే ఇండియాలో కూడా పలు చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ప్రజెంట్ ఈ టికెట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయని తెలుస్తుంది.తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.మరి ఈ సినిమా తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube