భోళా టీజర్ కోసం గెట్ రెడీ.. మెగా ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ అంటున్న అనిల్ సుంకర!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్’ ఒకటి.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

 Anil Sunkara Post On Bhola Shankar Teaser, Bhola Shankar, Anil Sunkara, Megastar-TeluguStop.com

తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రీమేక్ అయినప్పటికీ ముందు నుండి చిరు లుక్ తో ఈ సినిమాపై హైప్ పెరిగింది.ఈయనను మెహర్ రమేష్( Mehar Ramesh ) చూపిస్తున్న స్టైలిష్ లుక్ తో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్( Mega Fans ) కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు భోళా టీమ్ రెడీ అయిపొయింది.

ఈ రోజూ మెగా డే అనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా నుండి ఈ రోజు టీజర్ రాబోతుంది.

జూన్ 24న హైదరాబాద్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్( Sandhya 70MM Theater ) లో టీజర్ లాంచ్ చేయబోతున్నట్టు మేకర్స్ నిన్న సాయంత్రం అనౌన్స్ చేసారు.అప్పటి నుండి ఈ టీజర్ పైనే అందరి ద్రుష్టి పడింది.ఈ టీజర్ ను ఈ రోజు సాయంత్రం అటు థియేటర్ లో రిలీజ్ చేయడంతో పాటు ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా రిలీజ్ కాబోతుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ టీజర్ పై తాజాగా ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) మాట్లాడారు.ఈ రోజు మెగా భోళా మ్యానియా ఒక పెర్ఫెక్ట్ ఈవెనింగ్ ను మెగా ఫ్యాన్స్ కు అందిస్తుంది అని ఆ బిగ్ ట్రీట్ కు మెగా ఫ్యాన్స్ అంతా గెట్ రెడీ అంటూ ఈయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.మరి టీజర్ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ ( Keerthy Suresh )చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube