భగవంత్ కేసరి సీక్వెల్ పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే.. ఆ శక్తి ఇస్తే చాలంటూ?

భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) మూవీ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందని బాలయ్య అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భగవంత్ కేసరి సీక్వెల్ పై అనిల్ రావిపూడి మరోమారు స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Anil Ravipudi Clarity About Bhagavanth Kesari Details Here Goes Viral In Social-TeluguStop.com

తనతో కలిసి పని చేసిన అందరికీ ధన్యవాదాలు అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఈ సినిమాకు సీక్వెల్ చేసే ధైర్యం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Anil Ravipudi, Kajal Aggarwal, Sreeleela, Tollywood-Movie

ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని సీక్వెల్ మోయగలిగే శక్తిని బాలయ్య గారు నాకు ఇస్తే వెంటనే తీస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు.బాలయ్య అంగీకరిస్తే సీక్వెల్ కు సిద్ధమేనని అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు.దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్ లో అనిల్ ఐదు సినిమాలు చేశాడని భగవంత్ కేసరి కథ నాకు ఎప్పుడో చెప్పాడని ఆయన అన్నారు.తెలంగాణ మాండలికంలో బాలయ్య( Nandamuri Balakrishna ) డైలాగ్స్ చెబితే కొత్తగా ఉంటుందని అన్నానని దిల్ రాజు పేర్కొన్నారు.

Telugu Anil Ravipudi, Kajal Aggarwal, Sreeleela, Tollywood-Movie

మొదట ఈ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టి ఆ తర్వాత భగవంత్ కేసరిగా మార్చారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువగా తీసిన అనిల్ రావిపూడి ఇలాంటి బలమైన కథ రాయడం గొప్ప విషయం అని ఆయన కామెంట్లు చేశారు.శ్రీలీలకు నటిగా మంచి భవిష్యత్తు ఉందని భగవంత్ కేసరి రిలీజ్ కు ముందు శ్రీలీల( Sreeleela ) అంటే డ్యాన్స్ అనేవారని దిల్ రాజు అన్నారు.బాలయ్య డెడికేషన్ తో నటించారని ఇది లాంగ్ రన్ ఫిల్మ్ అని దిల్ రాజు కామెంట్లు చేశారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ నేను, అనిల్ రావిపూడి బాలయ్యకు అభిమానులమని మంచి మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని నందిని రెడ్డి అన్నారు.నందిని రెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube