ఆమె పాత్ర గురించి అడగొద్దంటున్న అనిల్ రావిపూడి..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్3.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరిష్ నిర్మించిన విషయం తెలిసిందే.

 Anil Ravipudi Said Dont Asking About Her Role , Anil Ravipudi, Tollywood, Director, Telugu Film Industry,sonal Chauhan,f3,surprise,pooja Hegde Item Song-TeluguStop.com

ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.వరుస ఇంటర్వ్యూలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు చిత్రబృందం.

 Anil Ravipudi Said Dont Asking About Her Role , Anil Ravipudi, Tollywood, Director, Telugu Film Industry,Sonal Chauhan,f3,Surprise,Pooja Hegde Item Song-ఆమె పాత్ర గురించి అడగొద్దంటున్న అనిల్ రావిపూడి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించిందన్న విషయం తెలిసిందే.మరి సోనాల్ చౌహాన్ ఇందులో ఎటువంటి పాత్రలో నటిస్తోందన్న విషయాన్ని మాత్రం చిత్ర బంధం ప్రకటించలేదు.

ఇదే విషయాన్ని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడిని ప్రశ్నించినప్పటికీ చెప్పను అని తేల్చి చెప్పేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి సోనాల్ చౌహాన్ పాత్ర గురించి స్పందించారు.

ఇంటర్వ్యూలో సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన ప్రశ్న ఎదురుగా.ఆ ప్రశ్న పై స్పందించిన అనిల్

ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ సోనాల్ లో ఎందుకు సెలెక్ట్ చేశామని మాత్రం అడగవద్దు.ఆమె పాత్రకు సంబంధించినంతవరకు ఒక సర్ప్రైజ్ వుంది.అందువల్ల ఆ విషయాలను రివిల్ చేయదలచుకోలేదని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.అనంతరం పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుతూ.సినిమాలో ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.ఇక ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఎఫ్ 4 సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube