తాజాగా టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన అంచనాలకు మించి దూసుకుపోతూ వసూళ్లను సాధిస్తోంది.
దీంతో ఈ చిత్రం అనిల్ రావిపూడి కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలచింది.అయితే తాజాగా అనిల్ రావిపూడి ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా తన జీవితంలో పడినటువంటి కొన్ని కష్టాలు మరియు కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు అనిల్ రావిపూడి.తాను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కథలు చెప్పేందుకు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని కాకపోతే ఎవరి నుంచి తనకు అనుకూలమైన స్పందన రాలేదని అన్నారు.
దాంతో కొంతమేర నిరాశ చెందిన సమయంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తనకు అవకాశం ఇచ్చారని, అంతేగాక ఆ సమయంలో పటాస్ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక నిర్మాతల కోసం వెతుకుతుండగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు.అయితే ఇది తెలుసుకున్న టువంటి కళ్యాణ్ రామ్ ఒకవేళ నిర్మాత ఎవరు దొరక్కపోతే తన సొంత బ్యానర్ పైనే నిర్మిస్తానని మాట ఇచ్చారని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
ఆ విధంగా గా తెలుగు పరిశ్రమలో తనని నిలబెట్టింది కళ్యాణ్ రామ్ అని అన్నాడు.