పాయకరావుపేట మండలం మంగావరం గ్రామం లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో టిడిపి మాజీ ఎమ్మెల్యే తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.అనంతరం పాయకరావుపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ఇప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్రాని అప్పుల్లో ముంచేసింది అని సుమారు 7 లక్షల కోట్లు అప్పు ఉందని ఈ లోటు భర్తీ చేయడానికి వచ్చే ఏ ప్రభుత్వానికి అయినా చాలా సమయం పడుతుందని రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ మరో శ్రీలంక లా మారడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
ప్రజా సంక్షేమం ప్రజా భద్రత వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఏదో రోజు ప్రజలే తిరగబడి ప్రశ్నిస్తారు అని అన్నారు.ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వారి పైన తప్పుడు కేసులు పెట్టడం హౌస్ అరెస్ట్ లు చెయ్యడం చేస్తున్నారని అన్నారు.
ఆసరా పేరుతో 45 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారని ఆరోపించారు.







