‘విద్య అందుబాటు’లో దేశంలోనే నంబర్ వన్‎గా ఏపీ..!

ఏపీ విద్యావ్యవస్థ మరో రికార్డును సృష్టించింది.కేరళను దాటిన ఏపీ( Andhra Pradesh ) దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

 Andhra Pradesh Is Number One In The Country In Education Access Details, Ap Stat-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సీఎం వైఎస్ జగన్( CM Jagan ) భారీ సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఏపీలోని ప్రీ ప్రైమరీ విద్యలో మరో ఘనతను సాధించింది.

విద్యారంగం అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.ఈ మార్పులు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇందులో ప్రధానంగా పాఠశాల విద్యలో తెచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఖ్యాతి గడిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సిల్ ‘ స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా ’ నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం దేశంలోనే ఏపీ మొదటిస్థానాన్ని చేరింది.విద్య అందుబాటులో కేరళను దాటిన ఏపీ రాష్ట్రం అత్యుత్తమ పనితీరును కనబరిచిందని చెప్పుకోవచ్చు.

Telugu Access, Ap, Cm Ys Jagan, Educational, Primeministers-General-Telugu

ఫౌండేషన్ విద్యను అందించే అంశంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ప్రధాని ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సిల్ నివేదికలో( Prime Minister’s Economic Advisory Council ) వెల్లడించింది.చిన్న రాష్ట్రాల కేటగిరీల్లోని వివిధ సూచీకల్లో విద్య( Education ) అందుబాటు అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది.తరువాత 36.55 స్కోరుతో కేరళ రాష్ట్రం( Kerala ) నిలిచింది.ఆ తరువాత రాజస్థాన్( Rajasthan ) 25.67 స్కోరు సాధించగా గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోర్లను సాధించాయిని నివేదిక పేర్కొంది.

Telugu Access, Ap, Cm Ys Jagan, Educational, Primeministers-General-Telugu

ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకపోతే పై తరగతుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే ప్రాథమిక విద్యతో పాటు ఒకటి, రెండు తరగతుల్లో అభ్యసనల మెరుగు కోసం నివేదిక పలు సూచనలను చేసింది.విద్య అందుబాటుతో పాటు మౌలిక సదుపాయాలు, అభ్యాస ఫలితాలు, కనీస ఆరోగ్యం అనే విభాగాల్లో మొత్తం 41 అంశాలతో నేషనల్ అచీవ్ మెంట్ సర్వే, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి రప్పించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించబడింది.

గతంలోని టీడీపీ ప్రభుత్వంలో విద్యలో ఎంతో వెనుకబడిన ఏపీ రాష్ట్రం సీఎం వైఎస్ జగన్ వచ్చిన తరువాత ఆయన తీసుకువచ్చిన సంస్కరణలతో ఏపీ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలను అధిగమిస్తూ ముందుకెళ్తుంది.ఈ క్రమంలోనే విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావడంతో పాటు ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతో వారి కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, విదేశీ విద్యాకానుక వంటి పలు పథకాలను ప్రవేశపెట్టారు సీఎం వైఎస్ జగన్.

దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube