సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగలలో సంక్రాంతి( Sankranthi ) ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు.

 Andhra Pradesh Government Announced Sankranti Holidays, Ap Government, Sankranti-TeluguStop.com

సంక్రాంతి అంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.ప్రధానంగా గోదావరి జిల్లాలలో కోడిపందాలు, రకరకాల ఆటలతో సందడి వాతావరణం నెలకొంటది.

చాలా చోట్ల నుండి గోదావరి జిల్లాలలో సంక్రాంతి వేడుకలకు ప్రజలు వస్తుంటారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను( Sankranthi Holidays ) తాజాగా ప్రకటించింది.

ఇంటర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.

ఆ తర్వాత ఈనెల 18న తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేయడం జరిగింది.

అంతేకాదు అన్ని ప్రభుత్వ, ప్రవేట్, ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని సెలవులలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.ఇదే సమయంలో పాఠశాలలకు పది రోజులపాటు సెలవులు ప్రకటించింది.

ఇంటర్ కాలేజీలకు మాదిరిగానే సెలవు రోజులలో పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.వాస్తవానికి జనవరి 16 వరకు సెలవులు ఉంటాయని అనుకున్నా ఆ తర్వాత మార్పు చేయడం జరిగింది.

ఈనెల 9వ తారీకు నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు 10 రోజులపాటు సెలవులు ప్రకటించింది.జనవరి 19వ తారీఖు స్కూలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube