డాక్టర్ బాబును బెదిరించిన సుమ.. హిస్టరీ రిపీట్ అంటూ..?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఈ సీరియల్ కు ప్రతి వారం మంచి టీఆర్పీ రేటింగ్ లు రావడంతో పాటు ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్, ఇతర పాత్రధారులకు మంచి పేరు వచ్చింది.

ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ వాళ్ల సొంత పేర్ల కంటే వంటలక్క, డాక్టర్ బాబు పేర్లతోనే పాపులర్ అయ్యారు.కార్తీకదీపం సీరియల్ పై సినిమాలు, కామెడీ ప్రోగ్రామ్ లలో కూడా పంచ్ లు వేస్తారంటే ఈ సీరియల్ ఎంత పాపులారిటీని సంపాదించుకుందో సులభంగానే అర్థమవుతుంది.

డాక్టర్ బాబు, వంటలక్క త్వరగా కలవాలని ఈ సీరియల్ వీరాభిమానులు కోరుకుంటున్నారు.యాంకర్ సుమ స్టార్ మా ఛానెల్ లో స్టార్ట్ మ్యూజిక్ అనే ప్రోగ్రామ్ కు యాంకర్ గా చేస్తుండగా ఆ షోకు తాజాగా నిరుపమ్ గెస్ట్ గా హాజరయ్యారు.

నిరుపమ్ తో పాటు సీరియల్ లో హిమ, శౌర్య, సౌందర్య పాత్రలు పోషిస్తున్న సహృద, కృతిక, అర్చన గెస్టులుగా హాజరయ్యారు.సుమ నిరుపమ్ ను ఏం దీపను ఎందుకు ఏడిపిస్తున్నావ్ ? అంటూ డాక్టర్ బాబును కత్తితో బెదిరించారు.ఆ తరువాత ఏడిపిస్తారా ఇంకోసారి అంటూ హెచ్చరించారు.

Advertisement

అపరిచితుడు సినిమాలోలా డాక్టర్ బాబును కొన్ని సెకన్ల పాటు బెదిరిస్తూ తరువాత సాఫ్ట్ గా మాట్లాడుతూ సుమ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

ఆ తరువాత సుమ నేను సీరియళ్లలో దిగనంతవరక .వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ డాక్టర్ బాబు అంటూ డైలాగ్ చెప్పారు.ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

నెట్టింట ఈ ప్రోమో వైరల్ అవుత్ండగా ఈ ప్రోమోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు