బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ (Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్(Extra Jabardasth) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company) కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అయితే మదర్స్ డే(Mothers Day) సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో నిర్వహించారు.ఇందులో రష్మీ అడిగే ప్రశ్నలకు ఓపెన్ హార్ట్ (Open Heart) తో సమాధానం చెప్పాలి అని చెప్పారు.
ఈ విధంగా ఈమె పలువురు సెలబ్రిటీలను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ (Indraja) సైతం యాంకర్ రష్మీని ప్రశ్నిస్తూ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించిన నువ్వు వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయావు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ…సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వచ్చాయి.అయితే రాత్రికి రాత్రే నా పాత్రలో ఇతరులు వస్తున్నారని ఈమె తెలియజేశారు.
ఇలా తాను ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయానని తెలిపారు.ఇక సాధారణంగా ఇండస్ట్రీలో అందరికీ ఒక స్టాంపు ఉంటుంది.
పలానా వారు సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించగలరని పలువురు చెల్లెలు పాత్రలోనూ, మరికొందరు అక్క వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారనే స్టాంప్ వారిపై ఉంటుంది.ఇలా వారిని ఆ పాత్రలలో తప్ప ఇతర పాత్రలలో ఊహించుకోరు అలాగే నాపై కూడా నేను సినిమాలలోకి పనికిరానని కేవలం యాంకర్ గా మాత్రమే తాను సెట్ అవుతాననే స్టాంపు తనపై ఉండటం వల్లే తనకి సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం లేదు అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక తనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిన టెలివిజన్ రంగాన్ని మాత్రం తాను ఎప్పటికీ వదులుకోనని ఈ సందర్భంగా రష్మి తెలియజేశారు.