పిల్లల్ని ప్రేమించే విషయంలో కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో తల్లికెవరూ సాటిరారనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన సమీర తక్కువ షోలు చేసినా ఈ షోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ స్టార్ యాంకర్ బిడ్డకు పాలిస్తూ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.బిడ్డకు పాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే డ్రెస్ ను ధరించానని సమీర తెలిపారు.
ప్రైవేట్ ప్లేస్ లలో సైతం ప్రైవసీ ఉండే డ్రెస్ లను తాను ధరించానని ఆమె కామెంట్లు చేశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు సమీర గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
సెలబ్రిటీల గురించి తమ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని సమీర మార్చేశారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.హ్యాట్సాఫ్ సిస్టర్, ఫ్రౌడ్ ఆఫ్ యు సిస్టర్ అంటూ ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
సమీర ప్రస్తుతం బుల్లితెర షోలకు దూరంగా ఉండగా ఆమె మళ్లీ టీవీ షోలతో బిజీ కావాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమీర భర్త అన్వర్ తమిళంలో పాపులర్ సీరియల్ యాక్టర్ కాగా తమిళంలో కూడా సమీరకు చెప్పుకోదగ్గ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.సమీర సినిమాల్లో ట్రై చేస్తే సినిమాల్లో కూడా ఆమె బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సమీరకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 8 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.సమీర సోషల్ మీడియాలో కొడుకుకు సంబంధించిన వీడియోలను తరచూ షేర్ చేస్తున్నారు.సమీర మంచి నటి మాత్రమే కాదని మంచి తల్లి కూడా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
సమీర కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.