పటాస్ కు అందుకే దూరమయ్యా.. రీజన్ చెప్పేసిన రవి..?

బుల్లితెర యాంకర్ రవి గురించి అందరికీ పరిచయమే.ఎన్నో షో లలో యాంకరింగ్ చేస్తూ.

మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.బిగ్ బాస్ ఫేమ్ లాస్య తో కలిసి తన యాంకరింగ్ ప్రయాణాన్ని మొదలు పెట్టిన రవ ప్రస్తుతం ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు.

గతంలో తన వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎక్కువగా పంచుకోని రవి మొత్తానికి తనకు ఓ ఫ్యామిలీ ఉందని బయట పెట్టేసాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆయన పటాస్ షో నుండి దూరం కావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

బుల్లితెరలో కొన్ని షోలలో ప్రయాణాలు ఎప్పటికీ శాశ్వతం కాదని ఎంతోమంది ఆర్టిస్టులు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Advertisement

పటాస్ షో నుండి బయటకు రావడం చాలా బాధ కలిగిందని, నాలుగేళ్లపాటు రక్తాన్ని చెమటగా మలిచి షో ను మరింతగా తీర్చిదిద్దామంటూ అని అన్నాడు.జీవితం కంటే ఎక్కువగా ప్రేమించిన ఇలాంటి షో ను వీడటం కాస్త జీర్ణించుకోలేని విషయం అంటూ.

అది నా మొఖం లోనే కనిపిస్తుందని తెలిపాడు.ఇక కొన్ని నిజాలు చెప్పాలంటే యాంకర్లు భయపడుతున్నారని చెప్పుకొచ్చాడు.

సమ్ థింగ్ స్పెషల్ డైలీ షో దాదాపు నాలుగు సంవత్సరాల్లో 900 ఎపిసోడ్ లు చేశానన్నాడు.ఇక ఆ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సమయం ఉండేది కాదని అలాగే పటాస్ షో కూడా తన జీవితంలో భాగంగా మారిందని తెలిపాడు.

అలాంటి పరిస్థితులు తనపై భారంగా మారాయంటూ దాంతో వారానికి ఒక్కసారి చేస్తే చాలు అనే ఫీలింగ్ ఏర్పడిందని తెలిపాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇక ఈ షో లో శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే.రవి, శ్రీముఖి కలిసి చేసే సందడిలే వేరు.ఇక ఈ షో నుండి శ్రీముఖి వెళ్లిపోవడానికి రవి, శ్రీముఖి పై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక వీటి గురించి కూడా స్పందించిన రవి ఈ షో నుండి శ్రీముఖి వెళ్లిపోవడం తనకు మరింత బాధ కలిగించిందని తెలిపాడు.శ్రీముఖి వేరే అవకాశం వచ్చినందున ఆమె వెళ్లిపోయిందని, ఎవరికీ మంచి అవకాశాలు వస్తే వారి వెళ్ళిపోతారు అంటూ అన్నాడు.

అంతేకాకుండా ఎవరైనా స్కూల్లో చదివిన తర్వాత కాలేజీకి వెళ్లాలి అనుకుంటారని ఆ విషయం లోని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తారంటూ తెలిపాడు.ఇక పటాస్ షో లో ఉన్నప్పుడే తనకు పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం వచ్చిందని, అప్పుడు ఆ షో కంటే పవన్ కళ్యాణ్ ఆఫర్ నచ్చడంతో తను కూడా పటాస్ షో వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

కెరీర్ విషయంలో ఎవరైనా మరో లెవెల్ కి వెళ్లాలని కోరుకుంటారని, అందుకే ఈ షో వదిలేసానని రవి తెలిపాడు.ఇక ఈ షోలో పంచులు కూడా రెగ్యులర్ గా మారాయని, కొత్తగా ఏమీ ఉండటం లేదని మాటలు వినిపించాయని తెలిపాడు రవి.దాంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ గా వద్దామని నిర్ణయం తీసుకున్నారట.అంతేకానీ నిర్వాహకులతో, శ్రీముఖి తో ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు