షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీలు ఈమద్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు.ప్రముఖ స్టార్స్ పలువురు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సందడి చేశారు.
హీరోలు హీరోయిన్స్ ఇతర టెక్నీషియన్స్, బుల్లి తెర సెలబ్రెటీలు, స్టార్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వైజాగ్‌లో కుటుంబ సభ్యులతో ఉన్న ముద్దుగుమ్మ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెడుతూ ఉండే ఈ అమ్మడు తాజాగా లైవ్‌లోకి వచ్చింది.
లైవ్‌లోకి వచ్చిన ఈ అమ్మడిని పలువురు పలు రకాల ప్రశ్నలు అడిగారు.
కొందరు సుధీర్ గురించి ప్రశ్నించగా కొందరు మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలు పెడతారంటూ ప్రశ్నించారు.కొందరు మాత్రం పెళ్లి గురించి అడిగారు.
ముగ్గురు నలుగురు పెళ్లి గురించి పదే పదే ప్రశ్నించడంతో నా పెళ్లి గురించి మీకు ఇంత ఆతృత ఎందుకో నాకు అర్థం కావడం లేదు.అయినా నా పెళ్లి నాపర్సనల్ విషయం, మీకెందుకురా బాబు అంటూ ప్రశ్నించింది.

ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని పెళ్లి చేసుకునేప్పుడు తప్పకుండా అందరికి చెప్తానంటూ చెప్పుకొచ్చింది.ఇక సుధీర్‌తో వ్యవహారం గురించి మాట్లాడుతూ తాము ఇద్దరం కూడా నటులం.కెమెరా ముందు బాగా నటిస్తాం.అంతకు మించి మా మద్య ఏమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.స్టూడియో బయటకు వస్తే కనీసం ఫోన్స్ కూడా చేసుకునే స్నేహం మా మద్య లేదని ఆమె చెప్పింది.