సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అందరికి తెలిసిందే.భారీ ప్రమోషన్స్ చేస్తేనే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా జనాల్లోకి వెళ్లట్లేదని చెప్పొచ్చు.
ఇక ఈ ప్రమోషన్స్ కోసం టాప్ యాంకర్స్ ని సైతం వాడేస్తున్నారు సినిమా వాళ్లు.టీజర్ రిలీజ్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వరకు యాంకర్స్ హెల్ప్ తీసుకోవాల్సిందే.
అయితే ఈవెంట్ లకు గట్రా సుమని తప్ప మిగతా వారిని తీసుకునే అవకాశం లేదు.ఆమె కాకుండా శ్యామలా, మంజూష లాంటి వారు ఉన్నారు.
అయితే ఈమధ్య కాలంలో ఈవెంట్ లతో పాటుగా ఇంటర్వ్యూస్ తో కూడా టాలెంట్ చూపిస్తుంది యాంకర్ మంజూష.ఆమే ఏమి కొత్త యాంకర్ కాకపోయినా మధ్యలో కొన్నాళ్లు కెరియర్ బ్రేక్ ఇచ్చిన అమ్మడు ఇప్పుడు తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది.
సినిమా రిలీజ్ ఉంటే చాలు ఆమె సందడి షురూ అవుతుంది.వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ లతో మంజూషా ఇప్పుడు కెరియర్ లో ఫుల్ బిజీ అయ్యిందని తెలుస్తుంది.
సుమ కాకుండా మిగతా ఈవెంట్స్ కు తానే ప్రత్యామ్నాయం కావాలని ప్రతి యాంకర్ అనుకుంటుంది.ఆ ప్రయత్నంలో మంజుషా ఆ ఛాన్స్ వాడుకోవాలని చూస్తుంది.







