Anchor Jhansi : ఆ వ్యక్తి మృతితో తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. బాధగా ఉందంటూ పోస్ట్ చేయడంతో?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించిన ఝాన్సీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన మాటలతో అలరించింది.

 Anchor Jhansi In Deep Tragedy Emotional Post Saying That It Is Very Sad-TeluguStop.com

కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఝాన్సీ.

ఇక తాజాగా విడుదల అయినా సలార్ సినిమాలో ఒక నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.యాంకర్, నటి గాయత్రీ భార్గవి మనందరికీ సుపరిచితమే.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయత్రీ భార్గవి తండ్రి సూర్యనారాయణ శర్మ( Suryanarayana Sharma ) తాజాగా తుది శ్వాస విడిచారు.కాగా ఇదే విషయాన్ని చెబుతూ ఝాన్సీ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

గాయత్రీ భార్గవి తండ్రి మరణించారు.ఆ వార్త నన్ను ఎంతగానో కలిచి వేసింది.

చాలా బాధగా అనిపిస్తుంది.వారి కుటుంబానికి ఆ దేవుడు శక్తినివ్వాలి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఝాన్సీ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

కాగా ప్రస్తుతం ఝాన్సీ ప్రస్తుతం సలార్ ( Salaar )సక్సెస్‌ మూడ్‌లో ఉంది.తాను పోషించిన పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఫుల్ జోష్ లో ఉంది.నెట్టింట్లో ఝాన్సీ పాత్ర మీద ప్రశంసలు అందుకుంటూ ఆనందంలో మునిగిపోయింది.

ఇలాంటి టైంలోనే ఇలా తన స్నేహితురాలి తండ్రి మరణించిన వార్తను తట్టుకోలేకపోతోంది.ఆయన మృతి పట్ల ఝాన్సీ ఎమోషనల్ అవుతోంది.

సలార్ తో పాటు ఝాన్సీ ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube