యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఒకప్పుడు సుమ,ఝాన్సీ, శిల్ప చక్రవర్తి వంటి యాంకర్స్ ఉండేవారు.
ఇలాంటి వారిలో సుమ (Suma) తర్వాత ఝాన్సీ మంచి స్థానం సంపాదించుకుంది.అయితే ప్రస్తుతం యాంకరింగ్ లో రాణించకపోయినప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
ఇక యాంకర్ ఝాన్సీ చేసిన పాత్రల్లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి.అలాంటి వాటిలో ఒక్కటే కోకాపేట ఆంటీ.
ఈ పాత్ర ఈమెకు ఎంతో మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది.ఇక యాంకర్ ఝాన్సీ జోగినాయుడు అనే మరో నటుడు నీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
జోగినాయుడు కూడా అందరికీ తెలుసు.ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
ఇక వీరిద్దరూ దాదాపు 9 సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లయ్యాక కనీసం కొద్ది రోజులు కూడా కలిసి ఉండలేక పోయారు.ఒక పాప పుట్టాక వీరిద్దరూ డివోర్స్( Divorce ) తీసుకున్నారు.
అయితే విడాకుల తర్వాత జోగి నాయుడు (Jogi Naidu) వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కానీ యాంకర్ ఝాన్సీ మాత్రం తన కూతుర్ని చూసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉండింది.కానీ రెండో పెళ్లి ( Second Marriage ) ఊసే ఎత్తలేదు.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఆమె మాట్లాడుతూ.నా కూతుర్ని చూసుకోవడంతోనే నా సగం లైఫ్ అయిపోయింది.
అయితే ఇంట్లో వాళ్ళు బంధువులు, ఫ్రెండ్స్ అందరూ రెండో పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు.కానీ మొదటి భర్తతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను.అందుకే రెండో పెళ్లికి అంత సుముఖంగా లేను.
ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే నన్ను నన్నుగా అర్థం చేసుకొని నా వ్యక్తిత్వాన్ని సర్దుకుపోయే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను.కానీ రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆశలు మాత్రం ఇప్పట్లో లేవు.
కానీ మంచి అబ్బాయి దొరికితే మాత్రం చేసుకుంటాను.అయితే ఒక అమ్మాయి పెళ్లిని ఇష్టంతో చేసుకోవాలి.
అలాగే పెళ్లి అనేది ఆమెకు బలం కావాలి కానీ బలహీనత అస్సలు కాకూడదు.నేను నా పెళ్లి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను.ఎన్నోసార్లు మోసపోయాను.సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను.అందుకే రెండో పెళ్లి గురించి అంత తొందరగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను అంటూ యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది.యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మాట్లాడిన మాటలు చూస్తుంటే నచ్చిని వ్యక్తి దొరికితే త్వరలోనే రెండు పెళ్లి చేసుకోబోతుందని కొంతమందిని కామెంట్లు పెడుతున్నారు
.