యాంకర్ అనసూయ బుల్లితెర షోలకు దూరం కావడం ఫ్యాన్స్ ను ఒకింత హర్ట్ చేసిన సంగతి తెలిసిందే.అనసూయ ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ రోల్స్ లో సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అనసూయ యాక్టివ్ గా ఉండగా అనసూయ చేసే పోస్ట్ ల గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతోంది.తాజాగా అనసూయ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేశారు.
అనసూయ పూజలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పుష్ప2 సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.తాజాగా కొత్త సంవత్సరం వేడుకలను అనసూయ గ్రాండ్ గా జరుపుకున్నారు.అనసూయ ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా ఈ లుక్ లో అనసూయ ఎంతగానో బాగున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పుష్ప2 సినిమాతో పాటు రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో అనసూయ గతంతో పోల్చి చూస్తే పారితోషికాన్ని భారీగా పెంచేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అనసూయ బుల్లితెర రీఎంట్రీకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
యాంకర్ అనసూయ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకు సైతం దూరంగా ఉంటున్నారు.అనసూయ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.అనసూయ వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు కాగా సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో కూడా అనసూయకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.అనసూయ దూరమైన తర్వాత జబర్దస్త్ షోకు రేటింగ్స్ అంతకంతకూ తగ్గుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అనసూయకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.దోషాల నివారణ కోసమే అనసూయ పూజలు చేశారని తెలుస్తోంది.