అనసూయ భరద్వాజ్ ( Anasuya Bharadwaj ) ప్రస్తుతం వెండితెర నటిగా ఎన్నో విభిన్న పాత్రలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఎప్పుడు ఒకే తరహా పాత్రలలో కాకుండా అనసూయ ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలోనూ విలక్షణ పాత్రలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.
ఒకప్పుడు కేవలం బుల్లితెర యాంకర్ గా బుల్లితెరకు మాత్రమే పరిమితం అయినటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెరకు స్వస్తి చెబుతూ వెండితెర నటిగా కొనసాగుతున్నారు.ఇలా నటిగా ఎంతో బిజీగా ఉండే అనసూయ తనకు షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
తన కుటుంబంతో కలిసి ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా అనసూయ తన భర్త పిల్లలతో కలిసి తమ ఫ్యామిలీలో జరిగినటువంటి పెళ్లి వేడుకలకు ( Marriage Celebration ) హాజరయ్యారు.
తాజాగా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా తన ఫ్యామిలీ మెంబర్స్( Anasuya Family Members ) తో కలిసి అనసూయ హల్దీ వేడుకలలో పాల్గొన్నారు.ఈ హల్దీ ఫంక్షన్ లో భాగంగా తన భర్త పిల్లలు ముగ్గురు ఒకే ఔట్ఫిట్ లో కనిపించగా అనసూయ మాత్రం పసుపు రంగు లంగా వోని ధరించి ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.ఇలా పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి ఈమె ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈమె లంగా వోని కట్టిన తన అందచందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.మొత్తానికి తన ఫ్యామిలీతో కలిసి అనసూయ ఎంతో ఛిల్ అవుతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ హల్దీ ( Haldi Celebrations) వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇలా సోషల్ మీడియా( Social media ) వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె పట్ల ఎంతోమంది నెగిటివ్ కామెంట్లు( Negative Comments ) చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు.
అయితే వాటిని తిప్పి కొట్టే అనసూయ గతంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు.ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇలా గతంలో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో వివాదాలను కాస్త తగ్గించిందని చెప్పాలి.తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.ఇక ఈమె త్వరలోనే రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అనంతరం పుష్ప 2 సినిమా( Pushpa ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి అనసూయ సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.