ఎన్నికల ఫలితాల పై కేటీఆర్ ట్వీట్... షాకింగ్ రిప్లై ఇచ్చిన అనసూయ?

తెలంగాణ 2023 ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి మనకు తెలిసిందే.ఈ ఎన్నికల ఫలితాలలో బిఆర్ఎస్ (BRS Party) ఓటమి చెందగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు.

 Anasuya Shocking Reply To Ktr On Telangana Election Result Details, Anasuya, Ktr-TeluguStop.com

ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైనటువంటి ట్వీట్ చేశారు.మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.ఈ ఎన్నికల ఫలితాలలో మేము ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందామని ఈయన భావోద్వేగం వ్యక్తం చేశారు.

Telugu Anasuya, Anasuya Ktr, Anchor Anasuya, Brs, Congress, Hyderabad, Ktr Tweet

అదేవిధంగా తెలంగాణలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎంతోమంది రిప్లై ఇస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి అనసూయ (Anasuya) కూడా కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ ఇచ్చినటువంటి రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారింది.అనసూయ రిప్లై ఇస్తూ సార్ మీరు నిజమైన నాయకులు ఎంతోమందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు.

ఇక మన రాష్ట్ర పరిస్థితిని అవతల వైపు నుంచి కూడా చూడాల్సిన అవసరం మీకు ఉంది.ఇలాంటి పరిస్థితులలో మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండి మీరు చేయాల్సింది చేయాలని కోరుకుంటున్నాను.

Telugu Anasuya, Anasuya Ktr, Anchor Anasuya, Brs, Congress, Hyderabad, Ktr Tweet

ఇప్పటివరకు మీరు హైదరాబాద్ కి( Hyderabad ) చేసిన అభివృద్ధికి ధన్యవాదాలు అన్నింటిలోనూ ఈ నగరంలో పురోగతి సాధించేలా చేసినందుకు ఈ హైదరాబాద్ నగరం తో ప్రేమలో పడ్డాను అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా కెసిఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని పొగుడుతూ ఈ సందర్భంగా ఈమె రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అనసూయ చేసిన పోస్ట్ పై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube