బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనసూయ ఒకరు.ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెరపై పలు సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఈమె తన సినీ కెరియర్లో బిజీగా మారిపోయారు.అయితే కొన్ని సినిమాలలో అనసూయ నెగిటివ్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు.

ఇలా నటిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అనసూయ కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అయితే గత కొద్దిరోజుల క్రితం ఈమె ఆంటీ వివాదం ద్వారా వార్తల్లో నిలిచారు.ఇలా తన గురించి ఎవరైనా నెగిటివ్ గా ట్రోల్ చేసిన ఈమె ఏ మాత్రం వెనకాడకుండా వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేయడమే కాకుండా తనను ట్రోల్ చేస్తున్న వారికి కూడా సమాధానం చెబుతూ వచ్చే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈమె నటుడు షారుఖ్ ఖాన్ వీడియోని షేర్ చేశారు.ఇందులో షారుక్ మాట్లాడుతూ.డర్ బాజీగర్ లో నేను నెగటివ్ రోల్ చేశాను.జాన్ అబ్రహం కూడా చాలా సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటించారు.ఇలా నెగిటివ్ పాత్రలలో నటించినంత మాత్రాన మేము చెడ్డవాళ్ళం కాదు.కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాంటి పాత్రలలో నటించామని చెప్పారు.
అయితే ఈ వీడియోని షేర్ చేసిన అనసూయ ఎప్పటినుంచో నేను చెబుతున్నది కూడా అదే కదా…మేము నెగిటివ్ పాత్రలలో నటిస్తామే తప్ప నిజ జీవితంలో అలా ఉండవు అంటూ ఈమె ఈ పోస్టును షేర్ చేశారు.ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
