క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో రామ్ చరణ్(Ramcharan) హీరోగా నటించిన చిత్రం రంగస్థలం( Rangasthalam ).ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ( Anasuya ) ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ సినిమాలో ఈమె పాత్ర ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే లెక్కలు మాస్టర్ డైరెక్షన్లో మరోసారి పుష్ప సినిమా ద్వారా అనసూయ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ( Allu Arjun ) , రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం పుష్ప(Pushpa).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమాలో విలన్ సునీల్ భార్యగా అనసూయ దాక్షాయని ( Dakshayani)పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇందులో అనసూయ గెటప్ అలాగే ఈమె పాత్ర చాలా విభిన్నంగా ఉంది.ఇక ఇందులో పుష్పరాజ్ తన తమ్ముడిని చంపడంతో అనసూయ పగతో సునీల్ పీక కూడా కోసి పుష్పరాజ్ పై పగతో ఉన్న విధంగా చూపించారు.
అయితే ఈమె పాత్ర పుష్ప2( Pushpa 2 ) లో కూడా ఉండబోతుందని,ఇందులో పుష్పరాజ్ పై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది.
ఇకపోతే ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభమయి చాలా రోజులైంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అనసూయ అడుగు పెట్టారని తెలుస్తుంది.ఇలా లొకేషన్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె దాక్షాయినిగా మేకప్ అవుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక సినిమా షూటింగ్ ప్రారంభమై చాలారోజులు అయినప్పటికీ అనసూయ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారని అందుకే ఈమె ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారనీ అర్థమవుతోంది.