అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్నటువంటి ఈమె అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో మాత్రం ఈమె యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయకు ఏకంగా సినిమా అవకాశాలు కూడా రావడం మొదలుపెట్టాయి.
ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ చివరికి బుల్లితెర కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పారు.
ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి ఈమె వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు త్వరలోనే రజాకర్, పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనుకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా తన కాలేజీ డేస్( College days ) కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేశారు ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలో ఎన్సిసి ( NCC ) లో కూడా పార్టిసిపేట్ చేశారు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్సిసి లో ఉన్నప్పుడే సుశాంత్( Sushanth ) తో పరిచయం ఏర్పడటం తన ప్రేమలో పడటం తన ప్రేమను గెలిపించుకోవడం కోసం పెద్దవారితో పోట్లాడి దాదాపు తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనసూయ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని పలు సందర్భాలలో తెలిపారు.
ప్రస్తుతం తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి అనసూయ మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈమె ఎన్సిసి లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి అనసూయ ఇందులో నేను ఎక్కడున్నానో గుర్తుపట్టండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం అనసూయ షేర్ చేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.