నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ( Congress ) హయాంలో భువనగిరి, సూర్యాపేట సాంఘీక సంక్షేమ హాస్టల్లో విద్యార్థినుల వరుస మరణాల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేసి,రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సాంఘీక సంక్షేమ హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలని బీఎస్పీ నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రటరీ తక్కెలపల్లి శ్రీనివాస్ అన్నారు.హాలియా మండల కేంద్రంలో శుక్రవారం బీఎస్పీ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లుఆధ్వర్యంలో అనుముల మండల తహశీల్దార్ జయశ్రీ కి వినతిపత్రం అందచేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన ప్రతి విద్యార్థిని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిచాలని డిమాండ్ చేశారు.రంగారెడ్డి జిల్లా( Rangareddy )లోని జన్వాడలో ఆర్ఎస్ఎస్ గూండాలు చర్చి కూలగొట్టి స్థానిక దళిత,మైనార్టీలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి కఠినంగా శిక్షించాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు , అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, పెద్దవూర మండల నాయకులు తరి రవికుమార్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.