టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ (Anasuya ) ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకోవడంతో ఈమె వరసగా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ వెండి తెరపై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ త్వరలోనే పెద్దకాపు ( Pedda Kaapu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ తన పెళ్లి అలాగే పెళ్లికి ముందు తన భర్తతో రిలేషన్ లో ఉన్న విషయం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు.
అనసూయ బీహార్ కు చెందినటువంటి శశాంక్ భరద్వాజ్ ( Shashank Bhardwaj ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఇక అనసూయ సినిమా షూటింగ్ కనుక లేకపోతే వెంటనే తన భర్త పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా కుటుంబం మొత్తం ఎంతో సరదాగా ప్రేమగా ఉంటారు.ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు ఆయనప్పటికీ ఎనిమిది సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో పోరాడి ఈమె ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
తాజాగా తన ప్రేమ పెళ్లి గురించి అనసూయ మాట్లాడుతూ తాను ఎనిమిది సంవత్సరాలపాటు తన భర్తతో పెళ్లికి ముందు నుంచి సహజీవనం చేశానని అయితే ఈ సమయంలో తాను ఎప్పుడూ కూడా నీ కులం( Cast ) ఏంటి అని తనని అడగలేదని తెలిపారు.నేను కులానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను.అందుకే ఎప్పుడూ కూడా శశాంక్ ను నీ కులం ఏంటి అని ప్రశ్నించలేదని తెలిపారు.అయితే పెళ్లి సమయంలో పెళ్లి పత్రిక చూసిన తర్వాత తన కులం ఏంటి అనే విషయం నాకు తెలిసిందని ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో సహజీవనం చేసిన విషయాన్ని అలాగే కులం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.