బుల్లితెర అందాల భామ అనసూయ ప్రస్తుతం బిజీ లైఫ్ లో దూసుకుపోతుంది.ఎక్కడ చూసినా ఈ బుల్లితెర భామకు క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.
కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అందరి దృష్టిలో పడుతుంది అనసూయ.ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
అలా బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియాలోనే కాకుండా ఈమధ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా అనసూయనే ముందు లిస్టులో ఉంది.గత కొన్ని రోజుల నుండి వరుస షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో బాగా బిజీ అవుతుంది.
ఇక తాజాగా మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కూడా పాల్గొంది.
కెరీర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.
ఇక బుల్లితెరపై జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టగా ఇక అప్పటి నుంచి అనసూయకు తిరుగులేదు అని చెప్పవచ్చు.ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ.
అసలు వెనుతిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతుంది.

జబర్దస్త్ లో తన ఎంట్రీ డాన్స్ తో, తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందర్నీ ఫిదా చేసింది.దీంతో ఆమెకు వెండితెరపై అవకాశం రాగా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒక వైపు యాంకర్ గా బాధ్యతలు చేపడుతూనే మరో పక్క నటిగా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీ బిజీగా మారింది.
కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది అనసూయ.కానీ తనకు నటిగానే మంచి క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం అనసూయ యాక్టివ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు అనసూయ.
పైగా తన భర్త నుండి తనకు పూర్తి ఫ్రీడం దొరకడంతో తన అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు అనసూయ బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

కొన్ని కొన్ని సార్లు వాటిని అస్సలు పట్టించుకోదు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సినవే.ప్రస్తుతం అనసూయ వెండితెరపై పలు సినిమాలలో బిజీగా ఉంది.దీంతో జబర్దస్త్ కు దూరంగా ఉంటుంది.కేవలం సినిమాలలోనే కాకుండా ఈమధ్య షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు అనసూయని సెంటిమెంటుగా భావిస్తున్నారు షాపింగ్ మాల్స్ ఓనర్స్.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వరుస షాపింగ్ మాల్స్ ని ఓపెన్ చేసింది.
ఇక వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంది.తాజాగా మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లగా దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
అనసూయ బిజీ లైఫ్ ని చూసి కొందరు మాత్రం ఈర్ష పడుతున్నారు అని చెప్పవచ్చు.ఇక మరికొంతమంది మాత్రం అనసూయ క్రేజ్ మామూలుగా లేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.







