Anasuya Bharadwaj : అనసూయ పై అలిగిన అభిమాని.. తన కోరిక తీర్చడానికి సిద్ధమైన నటి?

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇలా వరుస సినిమా అవకాశాలు( Movie Offers ) రావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరం అవుతూ వెండితెర సినిమాలలో నటిగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఈమె బిజీగా ఉన్నారు.

మరోవైపు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఇటీవల కాలంలో అనసూయ ఎక్కువగా షాపింగ్ మాల్స్( Shopping Malls Opening ) ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతూ అభిమానులను సందడి చేయడమే కాకుండా భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని కూడా తెలుస్తోంది.ఇక షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో అభిమానులను అనసూయ చాలా హార్ట్ చేస్తుంది అంటూ తాజాగా ఓ అభిమాని అనసూయ పై అలుగుతూ సోషల్ మీడియా వేదిక( Social Media )గా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో సెల్ఫీ అది ఇది అంటారు కానీ, అక్కడికి వచ్చిన తర్వాత కనీసం మా వైపు కూడా చూడరు అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.ఈసారైనా మాతో సెల్ఫీ దిగడానికి కుదురుతుందా అంటూ ఓ అభిమాని చేసినటువంటి పోస్ట్ కు అనసూయ రిప్లై ఇస్తూ.ఎంతమాట తెలియకుండా జరిగిపోతుందేమో కానీ తెలిసి అసలు కాదండి ఈసారి కచ్చితంగా మనం కలిసి సెల్ఫీ( Selfie ) దిగుదాం అంటూ రిప్లై ఇచ్చారు.

ఇక ఈమె త్వరలోనే నిర్వహించే కార్యక్రమంలో అభిమానులతో కలిసి దిగుతానని మాట ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు