రామగుండం ఎరువుల కర్మాగారంపై మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎఫెక్ట్( Medigadda Project Effect ) పడనుందని తెలుస్తోంది.ఈ మేరకు మరో రెండు నెలల్లో ఆర్ఎఫ్సీఎల్ కు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మే నెల నుంచి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు.కాగా శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు( Sri Pada Ellampalli Project ) నుంచి ప్రతి సంవత్సరం రామగుండం ఎరువుల కర్మాగారానికి 0.55 టీఎంసీలు నీటి సరఫరా అవుతుంది.అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి.
మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.దీంతో నీటి సరఫరా కొనసాగించాలని ఆర్ఎఫ్సీఎల్ అధికారులు ఈఎన్సీని కోరారు.
అయితే ఇప్పటికే బాయిలర్ ట్యూబ్ ల లీకేజీలతో యూరియా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఈ క్రమంలో నీటి కొరత ఎక్కువ అయితే మూడు లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతుంది.