జబర్దస్త్ హాట్ యాంకర్స్ ఇద్దరు ఒకే వెబ్ సిరీస్ లో

జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చిన హాట్ యాంకర్స్ గా అనసూయ, రష్మికి మంచి గుర్తింపు ఉంది.వీరిద్దరి గ్లామర్, హాట్ షోతో జబర్దస్త్ కి కాస్తా కలరింగ్ తీసుకొచ్చారు.

 Anasuya And Rashmi Gautam Entry In Web Series, Tollywood, Mallemala Entertainmen-TeluguStop.com

ఈ కారణంగానే జబర్దస్త్ చాలా వేగంగా జనాల్లోకి వెళ్ళగలిగింది.ఇక జబర్దస్త్ షో కారణంగానే రష్మికి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

అలాగే అనసూయకి కూడా నటిగా ఛాన్స్ లు వచ్చాయి.ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

రష్మి కూడా అడపాదడపా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.ఈ మధ్య అనవసరమైన సినిమాలు తగ్గించేసి కాస్తా గుర్తింపు వచ్చే పాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే వీరిద్దరు ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Telugu Anasuya, Mallemala, Rashmi Gautam, Tollywood, Web-Movie

అనసూయ, రష్మితో త్వరలో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.దీంతో మల్లెమాల ప్రొడక్షన్ డిజిటల్ ఎంట్రీ ఖరారు చేసుకుందని తెలుస్తుంది.

ఇక డిఫరెంట్ కథాంశంతో రొమాంటిక్, థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కి స్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే దీనికి దర్శకుడు ఎవరు, ఏ చానల్ లో ప్రసారం అవుతుందనే విషయాలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

లాక్ డౌన్ అనంతరం ఈ వెబ్ సిరీస్ గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.అనసూయ, రష్మి కాంబినేషన్ లో వెబ్ సిరీస్ వస్తుందనే మాట బయటకి రావడంతో ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube