రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోయాయి.ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాన్నిచెప్పుకోవచ్చు.
అధికార పార్టీ దండదండలతో రెచ్చిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు.నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.
ఈ ఇష్యూ కూడా రాష్ట్రంలో పార్టీకి కొంచెం డ్యామేజ్ కలిగిచింది.మరో ప్రధానమైన అంశం ఏపీకి ప్రత్యేక హోదా.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న 24 ఎంపీ స్థానాల్లో గెలిస్తే ప్రత్యేక హోదా సాధించి తీరతామని పాదయాత్రలో ప్రతీ చోట చెప్పారు.ఇప్పుడు అసలు ఆ ఊసే లేకపోవడం ప్రజల్లో చర్చ జరుగుతోంది.
అటు వైఎస్ వివేకానంద హత్యలో సొంత కుటుంబ సభ్యులపై ఆరోపణలు రావడం.చర్యలు లేకపోవడం వంటి అంశాలు జగన్పై కూడా కింది స్థాయి ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేసే స్థాయికి తీసుకెళ్లాయి.
పాలనలో జగన్పై కొంచెం సానుకూలత ఉన్నప్పటికీ.కొన్ని అంశాలు.
సంఘటనలు పార్టీకి కొరకరాని కొయ్యగా మారాయి.వైసీపీ నాయకులు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల అధికార పార్టీ చేయించిన సర్వేల్లో కూడా ఇదే అంశాలు తేటతెల్లమయ్యాయి.దీంతో వైసీపీ ఎమ్మెల్యేలను జనాల్లోకి సీఎం జగన్ ఆదేశించారు.
గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.

కానీ ఎమ్మెల్యేలకు చాలాచోట్ల పరాభవం ఎదురవుతోంది.సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు.ఇప్పుడే వైసీపీకి ఇలాంటి తలనొప్పులుంటే మరి ముందు ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని యోచిస్తున్నారు.ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే గత ఫలితాల్లాగా ఈసారి రాకపోవచ్చే అభిప్రాయాలు కలుగుతున్నాయి.ఇప్పటికే ఈ విషయం ఆ పార్టీ నేతలకు అర్ధమైంది.
మరి సీఎం జగన్ ఏ విధంగా ప్రజలను మెప్పిస్తారో చూడాలి.