అనన్య నాగళ్ల,( Ananya Nagalla ) ధనుశ్ రఘుముద్రి,( Dhanush Raghumudri ) సలోని, మీసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ, మనోజ్ వంటి తదితరులు ప్రధానోపాత్రలలో నటించినటువంటి తాజా చిత్రం తంత్ర.( Tantra Movie ) హార్రర్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా నేడు విడుదల అయింది.ఇప్పటికే హర్రర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉంది.అనన్య నాగళ్ల లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఇలాంటి నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేడు మార్చి 15వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయాన్నికి వస్తే.
కథ:
తంత్ర స్టోరీ విషయానికొస్తే.రేఖ (అనన్య నాగళ్ల) ఒక పల్లెటూరి అమ్మాయి.కాలేజ్ వెళ్లి చదువుకుంటూ ఉంటుంది.అదే ఊళ్లో అనాథ అయిన తేజు(ధనుశ్ రఘుముద్రి)ను ప్రేమిస్తూ ఉంటుంది.ఈయన కూడా కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఉంటారు.
ఇలా మంచి చదువులు చదువుతూనే గ్రామ ప్రజలకు చేదోడు వాదోడిగా ఉంటారు.అయితే రేఖకు( Rekha ) ఒక వింత పరిస్థితి ఎదురవుతుంది ప్రతి పౌర్ణమికి ఈమె రక్తాన్ని చిందిస్తూ ఉంటారు ఈ విషయం తెలిసినటువంటి ఒక తాంత్రికుడు తనపై చేతబడి చేస్తాడు.
ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటి? అందులోంచి రేఖ ఎలా బయట పడింది.ఈ క్రమంలో దుష్ట శక్తులను దేవీ శక్తులు తోడ్పాటు అందించయనేదే తంత్ర సినిమా కథ.
నటీనటుల నటన:
అనన్య నాగళ్ల అమాయక పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది.క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అన్యన నటన( Ananya Acting ) మరో లెవల్లో ఉంది.హీరోగా నటించిన ధనుశ్ రఘుముద్రి కొత్తవాడైన పర్వాలేదనిపించాడు.టెంపర్ వంశీ తాంత్రికుడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
హర్షకుడు అద్భుతమైన కథను ఎంపిక చేసుకొని దానిని చూపించడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తారని తెలుస్తోంది.ఇక బ్యాగ్రౌండ్ సోర్స్, ఫోటోగ్రఫీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ:
ఇప్పటివరకు ఈ విధమైనటువంటి తాంత్రిక శక్తులతో కూడినటువంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ సినిమా కూడా అదే నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాలో ఓ పాత్ర ద్వారా చెప్పించి తాంత్రిక విద్యలనేవి అనాదిగా వస్తున్న విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు.మరోవైపు తాంత్రిక విద్యలను చూసిస్తూనే తంత్ర విద్యల్లోని వశీకరణం, పాతాళ భట్టీ, శత్రువు ఆగమనం వంటి వాటిని కూడా చూపించారు.
తాను చెప్పదలచుకున్న విషయాన్ని కాస్త లెంగ్తీగా చెప్పడం బోరింగ్ కలిగిస్తోంది.ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఇబ్బంది కలిగించినా చివరి వరకు సస్పెన్స్ చేయడం బానే అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
కథనం, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్యాంగ్.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ ల్యాగ్, ఎడిటింగ్, అక్కడక్కడ కాస్త బోర్ కొట్టే సన్నివేశాలు.
బాటమ్ లైన్:
ఈ సినిమా గురించి ఫైనల్ గా ఏం చెప్పచ్చు అనే విషయానికి వస్తే ఈ తరహా సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని చివరి వరకు కాస్త ఆసక్తిగా చూడవచ్చు.