విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ( Anand Devrakonda ) తాజాగా బేబీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాa త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్( Baby Movie ) విడుదల చేశారు.
ఈ ట్రైలర్ మంచి ఆదరణ సంపాదించుకొని సినిమాపై అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కనుక చూస్తే ఇందులో హీరోయిన్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు.
ఈ క్రమంలోనే హీరోయిన్ మేకోవర్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి.హీరోయిన్ చాలా అందంగా ఉందని అయితే ఆమెను ఈ సినిమాలో మాత్రం చాలా అందవిహీనంగా చూపించారు అంటూ కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ పై కూడా లేటెస్ట్ గా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాగా.
సోషల్ మీడియా వేదికగా.ఆమె రెండు ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రోల్స్ పై హీరో ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ తన స్టైల్లో సమాధానం చెప్పారు.
ఈ విధంగా హీరోయిన్ గురించి వచ్చిన ఈ కామెంట్లపై స్పందించిన ఆనంద దేవరకొండ ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ చేయడం అనవసరం సినిమా చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి.ప్రతి ఒక్క సినిమాలోని హీరోయిన్ గ్లామర్ గా ఉండాలని ఏమీ లేదు బయట ఆమె ఎంత గ్లామర్ గా ఉన్న సినిమాలు మాత్రం కథను బట్టి తన మేకోవర్ ఉంటుందని కొన్నిసార్లు కథ డిమాండ్ చేస్తే డీ గ్లామర్ పాటలలో( De Glamor ) కూడా నటించాల్సి ఉంటుందని తెలిపారు.ఇది పూర్తిగా ఆమె నిర్ణయమే సోషల్ మీడియా నిర్ణయం కాదు కదా అయినా తనకు లేని బాధ ఇలా సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారికి ఎక్కువైపోయింది అంటూ ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ హీరోయిన్ గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.