వెరైటీ కారు తయారు చేసిన టీచర్.. ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు.రోజు ఏదోక పోస్ట్ చేస్తూ ఉంటారు.

 Anand Mahindra Praised The Teacher Who Made The Variety Car ,anadh Mahindra, Lat-TeluguStop.com

నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ వారి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెబుతూ ఉంటారు.సామాజిక, రాజకీయ అంశాలతో పాటు తన ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటారు.

పేదలకు అవసరమైన సహయం చేస్తూ ఉంటారు.బడా వ్యాపారవేత్తలు అసలు తమ బిజినెస్ వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు.

మీటింగ్ లతో బిజీబిజీగా ఉంటారు.సామాన్యుల సమస్యపై స్పందించే తీరిక వారికి ఉండదు.

తమ బిజినెస్ ను ఎలా పెంచుకోవాలనే దాని గురించే వాళ్లు ఆలోచిస్తూ ఉంటారు.సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించరు.

సోషల్ మీడియాలో ప్రజల సమస్యలు విని వారికి సహయం చేసే పనులు కూడా వ్యాపారవేత్తలు చేయరు.కానీ ఆనంద్ మహీంద్ర వారందరికీ భిన్నంగా ఉంటారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సహాయం చేస్తూ ఉంటారు.అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆసక్తికర విశేషాలను , వీడియోలను పంచుకుంటూ ఉంటారు.

అందులో భాగంగా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దీంతో బైక్ లు, కార్లకు కొనాలంటేనే చాలామంది భయపడే పరిస్థితి.దీంతో శ్రీ నగర్ కు చెందిన ఓ లెక్కల టీచర్ వినూత్నంగా ఆలోచించాడు.

ఇంధనం అవసరం లేకుండానే పనిచేసే ఓ వినూత్న కారును తయారుచేశారు.ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందు ఉంటారు.ఇలాంటి వాటిని తమ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఈ లెక్కల టీచర్ కారుకు సంబంధించిన విషయాలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో షర్ చేశారు.వినూత్నమైన ఈ కారుని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ముందని తెలిపారు.మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తుందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube