Anand Sujith Henry : అమెరికా : ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి .. ఇంటిపెద్దే హంతకుడా..?

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో( California ) సొంతింటిలోనే ఓ భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.ఇంట్లో ఎవరూ ఫోన్ ఎత్తకపోవడంతో వారి సన్నిహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 Anand Henry Indian Origin Techie Identified As Suspect In Killing Of Wife And T-TeluguStop.com

మృతులను కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42),( Anand Sujith Henry ) ఆయన భార్య ప్రియాంక (40),( Priyanka ) పిల్లలు నోహ్, నీథన్‌లుగా గుర్తించారు.ఇరు దేశాల్లో కలకలం రేపిన ఈ ఘటనలో ఆనంద్‌ను అనుమానితుడిగా గుర్తించారు పోలీసులు.

మెటాలో మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆనంద్ హెన్రీ .తన భార్యా పిల్లలను హత్య చేసి తర్వాత తనను తాను కాల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Telugu America, Anand Henry, Calinia, Indianorigin, Metasoftware, Neithan, Noah,

అలమెడ లాస్ పులగాస్‌లో నివసిస్తున్న వీరి కుటుంబానికి చెందిన సుజిత్ వారి ఇంటికి ఫోన్ చేయగా.ఎంతకు స్పందించలేదు.అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఈ ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లారు.తలుపులన్నీ మూసి వుండటంతో చిన్న కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించారు.బాత్రూం వద్ద దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించగా.వారి శరీరంపై తుపాకీతో కాల్చిన( Gunshots ) గాయాలున్నాయి.

వారి పక్కనే ఓ తుపాకీ, తూటాలను పోలీసులు గుర్తించారు.అటు తర్వాత బెడ్రూంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

వీరి శరీరంపై మాత్రం ఎలాంటి తుపాకీ గాయాలు కనిపించలేదు.

Telugu America, Anand Henry, Calinia, Indianorigin, Metasoftware, Neithan, Noah,

ఇంట్లోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో కుటుంబంలోని వ్యక్తే వీరి మరణాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.హత్య, ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఆనంద్ దంపతులు 2016లోనే విడాకుల కోసం దరఖాస్తు చేయగా.ఇంకా ప్రోసిడింగ్స్ జరుగుతున్నాయి.2020లో దాదాపు రూ.17 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసి అక్కడికి మకాం మార్చారు.హెన్రీ ప్రొఫైల్ ప్రకారం.

అతను మరణించే సమయంలో కృత్రిమ మేధస్సులో( AI ) పనిచేస్తున్నాడు.లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ను బట్టి అతని భార్య డేటా సైంటిస్ట్‌గా( Data Scientist ) విధులు నిర్వర్తిస్తున్నారు.

వీరిద్దరూ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube