2022 ప్రారంభం నుంచి AI ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ హవా ఎలా కొనసాగుతుందో మనం చూస్తూ వున్నాం.ఏఐ టెక్నాలజీ ఆకర్షణీయమైన కంటెంట్ ను రూపొందించడంలో ప్రస్తుతానికి విశేష ప్రతిభ కనబరుస్తోందని నిపుణుల మాట.
ఇపుడు అదే కంటెంట్ వినోదం, విద్య, మార్కెటింగ్ వంటి వివిధ రంగాలను శాసిస్తోందని చెప్పుకోవచ్చు.ఈ నేపధ్యంలో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ( Open AI ChatGpt ), గూగుల్ బార్డ్, Anthropic’s Claude వంటి జనరేటివ్ ఏఐ రియల్ మోడల్స్, ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడంలో సక్సెస్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో ఏఐ అనేది ప్రపంచాన్ని శాసిస్తుందని, పెను ప్రమాదంగా మారనుందని అనేకమంది భయాలు నూరిపోస్తున్నవేళ ఇపుడు కొత్తగా 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ హవా తగ్గిపోతుందని ఐటీ సర్వేలు( IT Survey ) చెప్పడం కాస్త కామెడీనే.ఇకపోతే AI- రూపొందించిన కంటెంట్ ఇంటర్నెట్‌లో మంచి క్రేజ్ ఉంది.అయితే దాని ప్రామాణికత, నాణ్యత విషయంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.AI- లు రూపొందించిన కంటెంట్ కస్టమర్లను తప్పుదారి పట్టించే విధంగా, హాని కలిగించే విధంగా ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అవును, ఈ నేపధ్యంలోనే తరువాత తరువాత దాని హవా పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రానున్న రోజుల్లో రియాలిటీ చెక్ ను ఎదుర్కోవలసి వుంటుందని సర్వేలు చెపుతున్నాయి.గ్లోబల్ టెక్నాలజీ సంస్థ సీసీఎస్ ఇన్ సైట్( CCS ) సర్వే ప్రకారం.2024నాటికి ఈ టెక్నాలజీ నిర్వహణ ఖర్చు, ట్రైనింగ్, ఏఐ ఆధారంగా జరిగే మోసాలతో పాటు ఇతర నష్టాలపై కంపెనీలు ఓ అంచనాకు వచ్చినపుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రియాల్టీ చెక్ ఎదుర్కొంటుందని తెలుస్తోంది.అంతేకాకుక్డ టెక్నాలజీ అమలతో ఏర్పడే ఇబ్బందులతో జనరేటివ్ AI వచ్చే ఏడాది రియాలిటీ చెక్‌ను ఎదుర్కొంటుందని CCS ఇన్‌సైట్ అంచనా వేస్తోంది.







