పీలేరు భూ అక్రమాలపై సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు.
పీలేరులో భూ అక్రమాలపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.ఈ భూ అక్రమాలపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
అనంతరం భూ మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు.భూ మాఫియాకు జగన్ ప్రభుత్వం సహకరిస్తుందని లోకేష్ ఆరోపించారు.
భూ మాఫియాలో వైసీపీ నేతలకు ప్రమేయం ఉన్నందుకే చర్యలు తీసుకోవడం లేదన్నారు.పీలేరులో భూకబ్జాకు పాల్పడ్డ మాఫియా పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.







