అమ్మాయిల కోసం భలే చెప్పులు.. పోకిరీలు టచ్‌ చేస్తే మటాష్ అయిపోతారు!

ఆడపిల్ల బయట కాలు పెడితే చాలు… కొన్ని వేలమంది మృగాలమధ్య నడవాల్సిన పరిస్థితి’ అని ఓ సినిమాలోని డైలాగ్.ప్రస్తుత ప్రపంచానికి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది.

 An Inter Student Develops Electric Slippers For Women Safety Details, Girls, San-TeluguStop.com

అవును, నేటి సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా వుందో మనకి రోజూ మీడియాలు చెబుతునే ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా క్షణానికొక ఆడది మగానిచేత బాధింపబడుతుందని సర్వేలు చెబుతున్నాయంటే అర్ధం చేసుకోండి.

ఇక వారికోసం ఎన్ని గవర్నమెంట్స్ ఎన్ని చట్టాలు తెచ్చినా వాటి ఫలితం మీకు తెలిసినదే.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఆడపిల్లలతో( Women ) అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఎదుర్కొనేందుకు ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఏదోఒక ఇన్నోవేషన్ చేస్తూనే వుంటారు.ఈ క్రమంలోనే అమ్మాయిల భద్రత కోసం ఝార్ఖండ్‌కు( Jharkhand ) చెందిన ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్ధి వినూత్న ఆవిష్కరణ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.కాళ్లకు వేసుకునే సాధారణ చెప్పులను కరెంట్ ​చెప్పులుగా మార్చదు.

అది కూడా అతి తక్కువ ధరలో.

ఝార్ఖండ్​లోని ఛత్రాకు చెందిన మంజీత్ ​కుమార్( Manjeet Kumar ) ఈ నూతన ఆవిష్కరణం చేయడం విశేషం.ఆపద సమయాల్లో మహిళలకు రక్షణ కవచంలా ‘విమెన్​ సేఫ్టీ డివైజ్‌’ అనే చెప్పులను రూపొందించాడు.మహిళలు, బాలికలు వేధింపులు ఎదురైన సమయంలో ఈ ఎలక్ట్రిక్​ చెప్పులతో వారిని తంతే కరెంట్ షాక్​ తగిలి వారు అక్కడికి అక్కడే కిందపడిపోతారు.

అలా వారిని తన్నినపుడు వీటికి కనీసం 220 నుంచి 300 వోల్ట్​ల షాక్​ వారికి తగులుతుంది.ఆ గ్యాప్‌లో బాధిత మహిళ అక్కడి నుంచి పారిపోవచ్చు.వీటిని వేసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం మహిళలకు వస్తుందంటున్నాడు ఈ ఝార్ఖండ్ కుర్రాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube