ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు యావత్ భారతదేశాన్ని షాకింగ్ కి గురి చేస్తున్నాయి.తాజాగా ఈ రాష్ట్రంలో మరొక దారుణం చోటు చేసుకుంది.
సోన్‌భద్ర జిల్లాలో( Sonbhadra ) జరిగిన ఆ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.వీడియోలో ఒక ఆటో-రిక్షా డ్రైవర్ వీధి మధ్యలో వృద్ధ మహిళపై హింసాత్మకంగా దాడి చేస్తున్నప్పుడు, చుట్టుపక్కలవారు ఈ దృశ్యాన్ని చూసి రికార్డ్ చేస్తున్నారు.
ఆ మహిళను డ్రైవర్ పదే పదే చెంపదెబ్బ కొట్టడం, కింద పడేసినట్లు వీడియోలో ఉంది.ఆ మహిళ తిరిగి పోరాడటానికి ప్రయత్నిస్తుంది, కానీ డ్రైవర్ ఆమెను గట్టిగా తన్నడంతో ఆమె మళ్లీ పడిపోయింది.
డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడు, మహిళ గాయపడి నిస్సహాయంగా ఉంది.దాడి వెనుక ఉద్దేశం తెలియరాలేదు.వీడియో ఆధారంగా పోలీసులు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.వారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, సీనియర్ సిటిజన్ల ( Women ,senior citizens )భద్రతకు గ్యారంటీ లేదని తెలుపుతోంది.అలాగే వృద్ధులను కొడుతున్న సమాజం వీడియోలు తీయడం వరకే పరిమితం అవుతుంది కానీ కనీసం మందలించడానికి కూడా ముందుకు రాదని కూడా స్పష్టమవుతోంది.డ్రైవర్ క్రూరత్వాన్ని, చూపరుల ఉదాసీనతను పలువురు నెటిజన్లు ఖండించారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులతో పాటు ఇంటర్నెట్ యూజర్లు కూడా పోలీసులను డిమాండ్ చేశారు.
మళ్లీ నిస్సహాయక స్థితిలో ఉన్న వృద్ధుల జోలికి వెళ్లకుండా సదరు ఆటో డ్రైవర్ కి పోలీసులు బాగా కోటింగ్ ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







