ఇపుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ పెనుదుమారాన్ని సృష్టిస్తోంది.ఇప్పటికే చాట్‌జీపీటీ, న్యూ బింగ్, గూగుల్ బార్డ్ ఏఐ ( ChatGPT, New Bing, Google Beard AI )అంటూ కొత్త కొత్త ఏఐ టూల్స్ మార్కెట్లోకి రాగా, వాటిని తలదన్నే ఏఐ వస్తుందని నిపుణులు కంగారు పడుతున్నారు.
దానికి కారణాలు అనేకం.ఎందుకంటే ఇవి మనుషులు చేయాల్సిన పనులను క్షణాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నాయి కాబట్టి.
కొత్త ఏఐ టెక్నాలజీతో మనుషుల మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా వుందని కొంతమంది వీటిపైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

ఎందుకంటే టెక్ కంపెనీలు సైతం మనుషులను తొలగించి వారి స్థానంలో ఏఐ టూల్స్ రోల్స్( AI tools roles ) క్రియేట్ చేసేందుకు రెడీ అయిపోతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది.కృత్రిమ మేధస్సుగా పేరొందిన ఏఐ టెక్నాలజీతో ప్రపంచంలో రాబోయే తరాలకు మరిన్ని అవకాశాలను అందించనుందని కొందరు సంబరపడుతుంటే, అసలు మనిషికి పననేదే దొరకని పరిస్థితి వస్తుందని కొంతమంది బాధపడుతున్నారు.

ఈ క్రమంలో ఇంకా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మానవ ఆలోచనలను డీకోడ్ చేయగల సామర్థ్యం చెందే ఏఐ రూపుదిద్దుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.లేటెస్ట్ రిపోర్టులప్రకారం.ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ సైంటిస్టులు సాధ్యంకాని పనిని సుసాధ్యం చేసినట్టు తెలుస్తోంది.ఎందుకంటే మానవ ఆలోచనలను తెలుసుకోవడం ఎవరితరం.అలాంటిది ఈ కొత్త టెక్నాలజీ మనిషి ఆలోచనలను కూడా టెక్స్ట్‌గా మార్చేస్తుందట.కంప్యూటర్ సైన్స్ డాక్టోరల్ విద్యార్థి జెర్రీ టాంగ్, న్యూరోసైన్స్, కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలెక్స్ హుత్ నేతృత్వంలో ఈ AI అధ్యయనం జరిగింది.







