ఆఫ్గాన్ నుంచి భారతీయులు తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది.ప్రత్యేక భారత వాయుసేన విమానంలో ఆదివారం ఉదయం 168న మందిని స్వదేశానికి తీసుకొచ్చారు.
వీరిలో 107 మంది భారతీయులు ఉన్నారు.వీరితో పాటు ఇద్దరు ఆఫ్గాన్ సెనేటర్లు, 24 మంది ఆఫ్గాన్ సిక్కులను కూడా భారత్ కు తీసుకువచ్చారు.
మరో రెండు విమానాల్లో 222 మందిని తరలించారు.ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానం దిగింది.
విమానం నుంచి దిగగానే ఒక్కసారిగా వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఆఫ్గాన్ ఎంపీ నరేంద్ర సింగ్ ఖల్సా ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాజా పరిస్థితిపై ప్రశ్నించగా అతను ఉద్వేగానికి లోనయ్యారు.నాకు ఏడుపు వచ్చేస్తుంది.
గత 20 ఏళ్లుగా పడ్డ కష్టం ఇప్పుడు శూన్యమైయ్యింది.అంటూ హిండన్ ఎయిర్ బేస్ లో విలేకరులకు వివరించారు.
ఆయనతో పాటు మరో సేనేటర్ అనార్కలీ హోనార్యార్ భారత్ కు వచ్చారు.ఇలాంటి ఆవేదనే వెలిబుచ్చారు.
కాగా కాబూల్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు తరలించడానికి రోజుకు రెండు విమాన సర్వీసులకు అనుమతి లభించింది.ఆదివారం మరో మూడు విమానాల్లో భారతీయులను తరలించారు.
ఎయిర్ఇండియా, ఇండిగో, విస్తారాకాబుల్ కు విమానయానసేవలు అందిస్తున్నారు.విమానాశ్రయంలో కూడా తాలిబన్లు అడ్డుకుంటున్నారు, వేధిస్తున్నారు ఇప్పటిదాకా మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెపుతున్నామని సిక్కు ప్రయాణికుడొకరు చెప్పారు.

మనసును కదిలించే దృశ్యాలు ఎన్నో.కాబూల్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.అంతా భయానికి పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడాన్ని పునర్జన్మగా భావించారు.సందర్భంగా అక్కడి మనుషులు చలింపజేసే అనేక దృశ్యాలు కనిపించాయి.ఆఫ్గాన్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.తాలిబాన్లు ఉన్న ఇంటిని తగల బెట్టారు.
దాంతో నేను నా కుమార్తె ఇద్దరూ కలిసి పారిపోవలసి వచ్చింది.భారతీయ సోదరులు, సోదరీమణులు మాకు రక్షణగా వచ్చారు.
భయానికి పరిస్థితుల్లో మాకు సహాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని కాబూల్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆఫ్గాన్ మహిళా శరణార్ది భావోద్వేగానికి గురయ్యారు.