తెలుగు లో మొదటి సూపర్ మ్యాన్ సినిమా అంటూ తెగ ఊరిస్తున్నా హను మాన్ సినిమా మేకర్స్.ఈ సినిమా లో హీరోగా తేజ సజ్జ నటించాడు.
ఇటీవల ఈయన నటించిన అద్బుతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
హను మాన్ సినిమా లో హీరోయిన్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఫేమ్ అమృత అయ్యర్ నటించింది.తేజ మరియు ఈమె కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయో కాని తాజాగా సినిమా మేకర్స్ విడుదల చేసిన హను మాన్ సినిమా లుక్ తో అమృత అయ్యర్ కు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రతి ఒక్క అభిమాని కూడా అమృత అయ్యర్ హను మాన్ లోని ఈమె పాత్ర గురించి వెయిట్ చేస్తున్నారు.

తేజ సజ్జ ఇప్పటికే సూపర్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తో సిద్దం అవుతున్నాడు.ఎక్కువ శాతం హాలీవుడ్ రేంజ్ సన్నివేశాలు ఈ సినిమా లో ఉంటాయని అంటున్నారు.ఒక సరికొత్త వండర్ వరల్డ్ లోకి వెళ్తాడని అంటున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమా తో దక్కించుకోవాలని చాలా గట్టిగానే దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.తేజ కు ఈ సినిమా కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ఇస్తే మాత్రం ఆయన కెరీర్ మారినట్లే.
ఆయన ఇండస్ట్రి వర్గాల వారితో సన్నిహితంగా మెలగడంతో పాటు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ బాగానే ఉంటుంది.అందుకే హను మాన్ సినిమా తో తేజ కు సక్సెస్ ఖాయం అంటున్నారు.
మొదటి సినిమా తర్వాత సినిమాలు చేయని అమృత అయ్యర్ కు కూడా ఇది ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుంది.







