భార్య, కొడుకులు వేడుకున్నా ఎన్నారైపై దుండగులు కాల్పులు.. గన్ జామ్‌ కావడంతో?

పంజాబ్ రాష్ట్రం, అమృత్‌సర్‌( Amritsar ) సిటీలో తాజాగా జరిగిన ఒక సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ సిటీలోని దబుర్జీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు( Gun Shooting ) కలకలం సృష్టించాయి.

ఇక్కడ ఒక ఎన్నారై రెసిడెన్స్ ఉంది.ఇది సుఖ్‌ చైన్ సింగ్‌( Sukhchain Singh ) అనే ఎన్నారైకు చెందినది.

మామూలుగా ఆయన అమెరికాలో ఉంటాడు.ఇటీవలే అమెరికా( America ) నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆ రెసిడెన్స్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు దుండగులు అతని ఇంటికి వచ్చారు.ఆపై వాళ్లు క్లోజ్ రేంజ్‌లో సుఖ్‌ చైన్ పై కాల్పులు జరిపారు.

Advertisement

ఈ షాకింగ్ ఘటన శనివారం రోజు జరిగింది.ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ముందు, లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

సుఖచైన్ సింగ్ ఇంటికి ఒక బైక్‌పై ఆ ఇద్దరు దుండగులు రావడం కనిపించింది.ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క తుపాకీ ఉంది.

తర్వాత లోపలికి వెళ్లి ఎన్నారైకి( NRI ) తుపాకీ గురిపెట్టి ఏదో వాదించారు.కారు రిజిస్ట్రేషన్ అంటూ, కారుకి సంబంధించిన విలువైన పాత్రలు ఇవ్వాలంటూ బెదిరించారు.

ఇదంతా చూస్తున్న ఆయన భార్య, పిల్లలు కంగుతిన్నారు.వీడియోలో పిల్లోడు కాల్చవద్దు అని దుండగులను ప్రాధేయపడటం కూడా కనిపించింది.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన నాగార్జున...
యూకేపై భారతీయ విద్యార్ధులకు తగ్గుతోన్న మోజు.. కారణాలేంటి..?

భార్య కూడా వేడుకున్నా వాళ్ళు పట్టించుకోకుండా సుఖ్‌ చైన్ సింగ్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

Advertisement

సుఖ్‌ చైన్ సింగ్‌కు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి.ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆయనకు ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి కానీ, ప్రాణాపాయము తప్పిందని డాక్టర్లు తెలిపారు.

సింగ్ ఇంటి సీసీ కెమెరా రికార్డు అయిన వీడియోలో దుండగులు తమ తుపాకులు జామ్ అయిపోవడంతో ఆ ప్రదేశం నుంచి పారిపోతున్నట్లు కనిపిస్తోంది.గన్ జామ్ కావడం వల్లే ఈ ఎన్నారై ప్రాణాలు దక్కాయి.

బాధితుడు అమెరికాలో నుంచి ఇరవై రోజుల క్రితమే అమృత్‌సర్‌ సిటీకి తిరిగి వచ్చాడు.అయితే అతని ఇంటి లోపలే ఇంత ఘోరమైన దాడి జరుగుతుందని బహుశా అతడు ఊహించి ఉండడు.

ఈ ఎన్నారై కొత్తగా కోటిన్నర రూపాయల విలువైన కారు కొనుగోలు చేశాడు.దాని గురించి అడిగేందుకు వచ్చామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన ఆ దుండగులు, ఆయనపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనకు సంబంధించి సుఖ్‌ చైన్ సింగ్ కుటుంబ సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఆయన తల్లి, ఈ దాడికి సుఖ్‌ చైన్ సింగ్ మొదటి భార్య కుటుంబమే కారణమని ఆరోపిస్తున్నారు.ఈ దాడి మొదటి భార్య చేయించిందా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు.

బాధితుడి తల్లి తన కొడుకు మాజీ భార్య పై అనుమానం వ్యక్తం చేసింది కాబట్టి ఇప్పుడు పోలీసులు ఆమెను విచారించేందుకు సిద్ధమయ్యారు.సుఖ్‌ చైన్ సింగ్‌పై జరిగిన కాల్పుల కేసులో ప్రభుత్వం అమృత్సర్ పోలీస్ కమిషనర్‌ను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ ఘటనలో సుఖచైన్ సింగ్ కుటుంబం తన మాజీ భార్య కుటుంబంలోని ఐదుగురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.సుఖ్‌ చైన్ సింగ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని విపక్ష పార్టీలు అధికార ఆప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి.

తాజా వార్తలు