డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించిన ‘బ్యాడ్ బాయ్'( Bad Boy ) చిత్రం కొన్ని నెలల క్రితం విడుదలయింది.ఈ చిత్రంతో డెబ్యూ నటిగా యంగ్ బ్యూటీ అమ్రీన్ క్యురేషి ఎంట్రీ ఇచ్చింది.
తొలి చిత్రంలోనే తన స్క్రీన్ ప్రెజన్స్, నటనతో అమ్రీన్ అందరిని ఆకట్టుకుంది.అంతే కాదు మిడ్ డే ఐకానిక్ షోబిజ్ అవార్డ్స్( Midday Showbiz Icon Awards ) లో ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది.
దీనితో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కేవలం బాలీవుడ్( Bollywood ) లో మాత్రమే కాదు సౌత్ లో కూడా నెమ్మదిగా ఆమె జోరు పెరుగుతోంది.
తాజాగా అమ్రీన్ క్యురేషి( Amrin Qureshi ) సౌత్ లో నాలుగు బడా నిర్మాణ సంస్థలతో చిత్రాలు చేసేందుకు సైన్ చేసింది. బ్యాడ్ బాయ్ లో ఆమె ఫెర్ఫామెన్స్ ఆకట్టుకోవడంతో గ్రీన్ స్టూడియోస్, ప్రిన్స్ పిక్చర్స్, ఎస్ వి సి సి, సరస్వతి ఫిలిం డివిజన్ ( ఠాగూర్ మధు) లాంటి బడా సంస్థలు ఆమెతో చర్చలు జరిపి బిగ్ బడ్జెట్ చిత్రాల కోసం ఒప్పందం చేసుకున్నాయి.
ఇలాంటి పెద్ద నిర్మాణ సంస్థల చిత్రాల్లో నటించే అవకాశం అందుకోవడంతో అమ్రీన్ సంతోషం వ్యక్తం చేసింది.సౌత్ లో ఇంత పెద్ద నిర్మాణ సంస్థలలో వర్క్ చేసే అవకాశం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధం.కాకపోతే నా పాత్రలో నటనకి ప్రాధాన్యత ఉండాలని భావిస్తాను.
ఇలాంటి పేరున్న నిర్మాణ సంస్థలలో నటించడం వల్ల గొప్ప అనుభవం కలుగుతుందని భావిస్తున్నా.నేను నటించబోయే కొన్ని చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్లానింగ్ జరుగుతున్నట్లు అమ్రీన్ సంతోషం వ్యక్తం చేసింది.







