తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది.ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.

 Amit Shah's Visit To Telangana Is Finalised-TeluguStop.com

ఈనెల 23న ముందుగా మధ్యాహ్నం 3.30 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు అమిత్ షా.సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ నోవాటెల్ లో ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.ఇటీవల ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న ట్రిపుల్ ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసించనున్నారని తెలుస్తోంది.తరువాత సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం సాయంత్రం 6 గంటలకు చేవెళ్లలో నిర్వహించే బీజేపీ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube