ఇక పూర్తిస్థాయిలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవాలని బిజెపి డిసైడ్ అయిపోయింది.ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ బిజెపి నాయకులకు ఎప్పటికప్పుడు తగిన గైడ్ లైన్స్ ఇస్తూ వస్తున్నారు.
వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ, ప్రజా సమస్యల విషయంలో బిజెపి శ్రేణులు పోరాటం చేసే విధంగా పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తోంది.అప్పుడప్పుడు కేంద్ర మంత్రులు, బిజెపి కీలక నాయకులు తెలంగాణకు వస్తు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
అదే సమయంలో బిజెపి శ్రేణులలోను ఉత్సాహం పెంచే విధంగా ప్రసంగాలు చేపడుతున్నారు.టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
కేంద్రంలో మోది ప్రభుత్వాన్ని గద్దె దంచడమే తన లక్ష్యం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.అలాగే జాతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ బిజెపి వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
దీంతో టిఆర్ఎస్ పై బిజెపి పెద్దలు మరింతగా ఫోకస్ పెట్టారు.తెలంగాణలోనే టిఆర్ఎస్ కు చెక్ పెట్టగలిగితే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను జీరో చేయవచ్చనే ఆలోచనతో ఉన్నారు.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారించారు.ఈ మేరకు ప్రతి నెల రెండు , మూడు రోజుల పాటు తెలంగాణలోని ఆయన మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతున్నారు.
అమిత్ షా తో పాటు, ఆర్ఎస్ఎస్ కు చెందిన కీలక నేత ఒకరు తెలంగాణలోనే ఎన్నికల వరకు మకాం వేసే విధంగా ఏర్పాట్లు చేశారట.ఇక తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయడం, టిఆర్ఎస్ నాయకులు బిజెపి పై చేస్తున్న విమర్శలు, తదితర అంశాలపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట.

ఇక నిరంతరం పార్టీ శ్రేణులు జనాల్లో ఉండే విధంగా తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాకు సూచించారట.ఆగస్టు రెండో తేదీ నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పాదయాత్ర ముగింపు సభను భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు .ఈ సభకు అమిత్ షా హాజరు కాబోతున్నారట.దీంతో పాటు ప్రతి నెల రెండు మూడు రోజులపాటు తెలంగాణలోని మఖాం వేసి బిజెపిని జనాల్లోకి తీసుకు వెళ్లే వ్యూహంలో అమిత్ షా నిమగ్నం కాబోతున్నారట.
అలాగే కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటనలు చేస్తూ టిఆర్ఎస్ పై జనాలలోను వ్యతిరేకత పెంచే పనిలో నిమగ్నం కాబోతున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.
.






