సహజంగా రాజకీయ నాయకులను విచారించే కేసులు భారతదేశంలో ఎక్కువగా సిబిఐ( CBI ) మాత్రమే డీల్ చేస్తుంది.చెప్పుకోదగ్గ ఏదైనా ఒక కుంభకోణం బయటపడగానే ప్రతిపక్షాలు సిబిఐ ఎంక్వయిరీ ని డిమాండ్ చేస్తూ ఉంటాయి.
దేశంలో మెజారిటీ అవినీతి కేసులను డీల్ చేస్తున్న సంస్థగా సిబిఐ కు పేరు ఉంది.అయితే ఆంధ్రప్రదేశ్ వరకూ మాత్రం ఏపీ సిఐడి( AP CID ) సిబిఐ ని మించిన దూకుడు తో ముందుకెళ్తుంది.
చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తర్వాత పరిణామాలను గమనిస్తే చంద్రబాబును ఇరుకున పెట్టాలన్న పట్టుదల సిఐడి కి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది .ముఖ్యంగా రెండు సంవత్సరాలకు పై విచారణ చేసి రెండు వేల పేజీలకు పైగా రిమాండ్ రిపోర్టును తయారు చేయడం, కోర్టుల్లో బాబుకు రిలీఫ్ దొరక్కుండా పూర్తిస్థాయి ఆధారాలను సబ్మిట్ చేయగలగటం, దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ఈ కేసు కు సంబంధించి లీకులు ఇవ్వడం చూస్తుంటే సిఐడి పై రాజకీయ ఒత్తిడి కూడా ఉంది అన్నది తెలుగుదేశం మీడియా వాదన.

ఇప్పుడు ఈ దిశగా తెలుగుదేశం నేతలు ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు( Kinjarapu Ram Mohan Naidu ) నాయకత్వం లో భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా( Amit Shah ) కలసి పిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది.సర్వీస్ నిబంధనలను అతిక్రమించి అధికారపక్ష తొత్తుగా సిఐడి అధినేత సంజయ్ మారిపోయారని చంద్రబాబు పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఈ కేసులో ఆయన లీకులు ఇస్తున్నారని నిబంధనలు ప్రకారం నడుచుకునేలా ఆయనను ఆదేశించాలంటూ అమిత్ షాను కోరినట్లుగా తెలుస్తుంది.

అయితే తాము నిబంధనలు ప్రకారమే ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నాం అన్నది సిఐడి అధికారులు వాదన.అయితే జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) కేంద్ర పెద్దలకు ఇప్పటికే వివరించి ఉన్నందున ఈ కేసులో అమిత్ షా తెలుగుదేశానికి ఊరట కలిగేలా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది.అయితే సిఐడిని కార్నర్ చేయడం ద్వారా ఈ కేసులో సిఐడి దూకుడుగా వెళ్లకుండా కంట్రోల్ చేయాలని లోకేష్ వ్యవహారంలో కాస్త పట్టు సడలించేలా సిఐడి కి సంకేతాలు ఇవ్వాలన్న కోణం లోనే తెలుగుదేశం వ్యూహాత్మకంగా హోమ్ మినిస్టర్ కి కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది
.