తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28వ తారీకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) రాష్ట్ర పర్యటన ఖరారు అయింది.ఈనెల 28న మధ్యాహ్నం 12:05 గంటలకు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అనంతరం విమానాశ్రయం నుంచి నోవాటెల్ కి వెళ్తారు.అదే హోటల్ లో 12:20 నుంచి 01:45 గంటల వరకు రాష్ట్ర బీజేపీ( BJP ) ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం 01:50 గంటలకు కొంగరకలాన్ లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.ఈ సమావేశంలో 2024 పార్లమెంట్ ఎన్నికలకు( 2024 Parliament Elections ) ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అన్నదానిపై దిశా నిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వారాల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరగటం తెలిసిందే.
ఆ సమయంలో అమిత్ షా భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని చోట్ల రోడ్డు షోలతో పాటు భారీ ఎత్తున బహిరంగ సభలలో అమిత్ షా ప్రసంగించడం జరిగింది.కానీ కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుండే అమిత్ షా… పార్టీ నాయకులను అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో భారీ ఎత్తున స్థానాలు గెలిచే విధంగా అమిత్ షా.తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కొన్ని సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.