తెలంగాణపై అమిత్ షా ఫోకస్...అధికారమే టార్గెట్టా?

తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడుతోన్న పరిస్థితి ఉంది.ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల కాలం ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం నెలకొంది.

 Amit Shah Focus On Telangana Politics Details, Bjp Party, Bandi Sanjay, Kcr , Te-TeluguStop.com

టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగేలా వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇక యూపీ లాంటి రాష్ట్రాలలో గెలిచి జోష్ మీదున్న అమిత్ షా తెలంగాణ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో ఇక తరచుగా తెలంగాణలో పర్యటన చేయడంతో పాటు ఇక్కడే ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారట.ఇక ఈ వార్తలతో తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం లేజర్ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇప్పటికే బండి సంజయ్ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతున్నామని పెద్ద ఎత్తున భావిస్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం రణరంగంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే తెలంగాణలో కెసీఆర్ ను ఓడించడమంటే అంత సులభమైన విషయం కాదు.ఎందుకంటే తెలంగాణను సాధించిన కెసీఆర్ కు క్షేత్ర స్థాయి ప్రజల్లో ఉన్న పేరు చాలా గొప్పది.ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ప్రజల మనసు ఎలా మారుతుందో వారు ఎవరికి మద్దతిస్తారో ఊహించలేము కాబట్టి మరి అమిత్ షా ఫోకస్ తో తెలంగాణలో కెసీఆర్ వ్యతిరేక పవనాలు మరింత వీస్తాయా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Amit Shah Focus On Telangana Politics Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube